ఆ సినిమా నాకో పాఠం నేర్పించింది: దర్శకుడు మారుతి

  • 'ప్రేమకథా చిత్రం' నేనే తెరకెక్కించాను 
  • సినిమా చూసినవాళ్లు అలా అనడంతో ఆలోచనలో పడ్డాను 
  • తన నమ్మకమే నిజమైందన్న మారుతి  
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో దర్శకుడు మారుతి మాట్లాడుతూ, 'ప్రేమకథా చిత్రం' సినిమాను గురించి ప్రస్తావించాడు. 'ప్రేమకథా చిత్రం' సినిమాకి నేనే దర్శకత్వం వహించాను. ముందుగా ఈ సినిమాను చూసినవాళ్లు 'ఇదేం సినిమారా బాబూ .. మా మాట విని నీ పేరు వేసుకోకు .. మీ కెమెరా మేన్ పేరు వేసేయి .. లేదంటే అప్పటివరకూ సంపాదించుకున్న క్రేజ్ పోతుంది' అన్నారు.

ఆ సినిమాపోతే కెరియర్ పరంగా వెనక్కి వెళ్లిపోతానేమో అనే భయంతో దర్శకుడిగా మా కెమెరామెన్ పేరు వేశాను. ఒక మూలన మాత్రం ఏదో చిన్న ఆశ వుంది. అందువలన ఇది మారుతి సినిమా అంటూనే ప్రమోషన్ చేశాము. నేను అనుకున్నట్టుగానే సినిమా హిట్ అయింది. చిన్న సినిమానా .. పెద్ద సినిమానా అని కాదు, కొత్తదనం వున్న సినిమాలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే ఒక పాఠాన్ని ఈ సినిమా నేర్చుకునేలా చేసింది" అని చెప్పుకొచ్చాడు.
Go Back to Shorts
Maruthi
Ali
Sai Tej

More Telugu News